Trapped On Giant Wheel At Cuttack Baliyatra | శాటిలైట్స్ రిపేర్స్ కాదురోయ్..ఎగ్జిబీషన్ జాయింట్ వీల్ రెస్క్యూ ఆపరేషన్

ఒరిస్సాలో జాయింట్ వీల్ ఆగిపోవడంతో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్‌తో రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Trapped on Giant Wheel at Cuttack Baliyatra

విధాత : ఒరిస్సాలోని కటక్‌లో బాలి జాతర సందర్భంగా జాయింట్ వీల్(రంగుల రాట్నం) ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ చేసిన ఆపరేషన్ వీడియో వైరల్ గా మారింది. జాతరలో ఏర్పాటు చేసిన భారీ జాయింట్ వీల్ ఆకాశంలో తిరుగుతున్న సందర్భంలో అకస్మాత్తుగా పనిచేయకుండా ఆగిపోయింది. అదృష్టవశాత్తు సందర్శకులు కూర్చున్న ఊయల బాక్స్ ఒకటి ఆకాశంలో గాలిలో సరైన దిశలో నిలిచిపోయింది. లేదంటే అక్కడి నుంచే అందులోని సందర్శకులు 8మంది నేలపై పడిపోయి ప్రాణాలు పోగొట్టుకునే వారే. అయితే ఆగిపోయిన జాయింట్ వీల్ బాక్స్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక దళం రెస్క్యూ టీమ్ భారీ హైడ్రాలిక్ క్రెయిన్ ను వినియోగించింది.

అది నెమ్మదిగా పైన గాలిలో ఆగిపోయిన జాయింట్ వీల్ బాక్స్ వద్ధకు చేరుకోగా.. అందులోని ప్రయాణికులను నెమ్మదిగా జాయింట్ వీల్ బాక్స్ లో నుంచి క్రేన్ బాక్స్ లోకి తరలించి రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆకాశంలో గాలిలో ఎత్తున ఆగిపోయిన జాయింట్ వీల్ నుంచి భారీ క్రెయిన్ తో చేసిన రెస్క్యూ ఆపరేషన్ అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మరో శాటిలైట్ లో వెళ్లి మరమ్మతులు చేసిన దృశ్యాల మాదిరిగా కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Latest News