Accident | గ్యాస్ సిలిండ‌ర్ల ట్ర‌క్కును ఢీకొట్టిన ట్యాంక‌ర్.. పేలుడు శ‌బ్దాల‌తో ద‌ద్ద‌రిల్లిపోయిన ర‌హ‌దారి

Accident | జైపూర్ : రాజ‌స్థాన్‌( Rajasthan )లోని జైపూర్ - అజ్మీర్ హైవే( Jaipur-Ajmer highway ) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి భ‌యాన‌కంగా మారింది. గ్యాస్ సిలిండ‌ర్ల‌( Gas Cylinders )ను త‌ర‌లిస్తున్న ట్ర‌క్కును ట్యాంక‌ర్ ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా ట్ర‌క్కులో మంట‌లు చెల‌రేగాయి. గ్యాస్ సిలిండ‌ర్లు పేలిపోయి ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లింది.

Accident | జైపూర్ : రాజ‌స్థాన్‌( Rajasthan )లోని జైపూర్ – అజ్మీర్ హైవే( Jaipur-Ajmer highway ) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి భ‌యాన‌కంగా మారింది. గ్యాస్ సిలిండ‌ర్ల‌( Gas Cylinders )ను త‌ర‌లిస్తున్న ట్ర‌క్కును ట్యాంక‌ర్ ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా ట్ర‌క్కులో మంట‌లు చెల‌రేగాయి. గ్యాస్ సిలిండ‌ర్లు పేలిపోయి ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లింది.

ఒక వైపు భారీగా ఎగిసిప‌డుతున్న మంట‌లు.. మ‌రోవైపు గ్యాస్ సిలిండ‌ర్లు పేలుతున్న శ‌బ్దాల‌తో వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు, స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ మంట‌లు, శ‌బ్దాలు కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కు క‌నిపించాయి.. వినిపించాయి. భారీ పేలుళ్ల కార‌ణంగా స‌మీపంలో ఉన్న వాహ‌నాలు కూడా దెబ్బ‌తిన్నాయి. రోడ్డు పూర్తిగా ధ్వంస‌మైంది. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు ఆగిపోయాయి.

స‌మాచారం అందుకున్న జైపూర్ ఐజీ రాహుల్ ప్ర‌కాశ్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. ట్ర‌క్కు, ట్యాంక‌ర్ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు క‌నిపించ‌డం లేద‌ని పోలీసులు తెలిపారు.

రాజ‌స్థాన్ సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ ఆదేశాల మేర‌కు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా ఘ‌న‌టాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఓ వ్య‌క్తిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేద‌న్నారు. అయితే ట్ర‌క్కు డ్రైవ‌ర్, క్లీన‌ర్ ఆచూకీ కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌త్య‌క్ష సాక్షి క‌థ‌నం ప్ర‌కారం.. ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను త‌ర‌లిస్తున్న ట్ర‌క్కును ర‌హ‌దారి ప‌క్క‌న నిలిపి ఉంచి.. డ్రైవ‌ర్ భోజ‌నానికి వెళ్లిన‌ట్లు పేర్కొన్నాడు. అంత‌లోనే అటుగా వ‌స్తున్న ఓ ట్యాంక‌ర్ అదుపుత‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టిన‌ట్లు తెలిపాడు. దీంతో మంట‌లు చెల‌రేగాయ‌న్నారు. తీవ్ర గాయాల‌పాలైన‌ ట్ర‌క్కు డ్రైవ‌ర్‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నాడు.

గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో ఇదే హైవేపై భంక్రోటా వ‌ద్ద ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను త‌ర‌లిస్తున్న ట్ర‌క్కు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.