Site icon vidhaatha

కేరళలో మావటి ప్రాణాలు తీసిన ఏనుగు

విధాత : కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఇడుక్కిలోని ఓ ప్రైవేటు అక్రమ ఏనుగుల సఫారీ కేంద్రంలో మావటి బాలకృష్ణన్‌(62)పై ఏనుగు ఆకస్మికంగా దాడి చేసి అతడిని కసి తీరా తొక్కి చంపి తొండంతో విసిరికొట్టింది. మృతుడు నీలేశ్వరం నివాసి బాలకృష్ణన్ (62)గా గుర్తించారు. ఒక పర్యాటకుడు ఏనుగుపై స్వారీ చేసేందుకు మావటి బాలకృష్ణ దానిని చేతి ముల్లు కర్రతో తరలించే ప్రయత్నంతో చేయగా, కోపం తెచ్చుకున్న ఏనుగు అతనిపై దాడి చేసి చంపేసింది.

మరో మావటి అక్కడికి చేరుకునేలోగానే అతని ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా ఏనుగు సఫారీ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసి స్టాప్ మెమో జారీ చేశారు. ఈ సఫారి కేంద్రం యానిమల్‌ వెల్ఫర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ కాలేదని, అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

Exit mobile version