చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ …11మంది మావోయిస్టుల మృతి

చత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11మంది మావోయిస్టులు మృతి చెందారు. కొహకమెట్ పీఎస్ ధనంది-కుర్రెవాయ్ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది

  • Publish Date - July 2, 2024 / 06:11 PM IST

విధాత : హైదరాబాద్: చత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11మంది మావోయిస్టులు మృతి చెందారు. కొహకమెట్ పీఎస్ ధనంది-కుర్రెవాయ్ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల అనంతరం 11మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చత్తీస్ గఢ్ కేంద్రంగా మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, ఎన్‌కౌంటర్‌లులు చేపడ్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే 150మందికి పైగా మావోలు మృతి చెందారు. భౌగోళికంగా మావోయిస్ట్ లకు అత్యంత అనుకూలమైన అబూజ్ మఢ్ వంటి దట్టమైన అడవిలో, కొండ ప్రాంతాల్లో సైతం పోలీసు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో విస్తరించివున్న అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోల ఏరివేతకు నిర్వహిస్తున్న విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు భారీగా ప్రాణ నష్టం ఎదుర్కోంటున్నారు.

Latest News