Site icon vidhaatha

Black Panther | అరుదైన దృశ్యం.. అర్ధ‌రాత్రి వేళ ‘న‌ల్ల చిరుత‌’ నైట్ వాక్

Black Panther | హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు( Tamil Nadu )లోని నీల‌గిరి( Nilgiris ) బ‌యోస్పియ‌ర్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఓ బ్లాక్ పాంథ‌ర్( Black Panther ).. అదే న‌ల్ల చిరుత క‌నిపించింది. అదేదో బ్లాక్ పాంథ‌ర్ మాత్ర‌మే క‌నిపించ‌లేదు. ఆ న‌ల్ల చిరుత‌తో పాటు మ‌రో రెండు చిరుత‌లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఇక నీల‌గిరి అడ‌వుల్లోని ఓ ర‌హ‌దారిపై న‌ల్ల చిరుత ద‌ర్జాగా నైట్ వాక్( Night Walk ) చేస్తుంటే మ‌రో రెండు చిరుత‌లు( Leopards ) దానికి బాడీ గార్డుల్లా మాదిరి న‌డ‌క సాగించాయి. ఈ అరుదైన దృశ్యం అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ చిరుత‌ల న‌డ‌క చూస్తుంటే.. న‌ల్ల చిరుత‌కు ఏం రాజ‌సం రా అనిపించ‌క త‌ప్ప‌దు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా క‌నిపించే న‌ల్ల చిరుత‌కు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌స్వాన్ ( Parveen Kaswan ) త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బ‌ఘీర( Bagheera ) త‌న స్నేహితుల‌తో క‌లిసి నీల‌గిర రోడ్ల‌పై నైట్ వాక్ చేస్తోంది. ఇది చాలా అరుదైంది అని క‌స్వాన్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Exit mobile version