Bombay High Court | మీ మాజీ భర్తకు భరణం చెల్లించండి.. ఓ మహిళకు బాంబే హైకోర్టు ఆదేశం..

Bombay High Court : అనారోగ్యం కారణంగా సంపాదించుకోలేని స్థితిలో జీవనం గడుపుతున్న మీ మాజీ భర్తకు మీరే భరణం చెల్లించాలంటూ.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళను బాంబే హైకోర్టు ఆదేశించింది. జీవనం గడపడం కోసం, వైద్య ఖర్చుల కోసం అతనికి నెలకు రూ.10 వేల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. అనారోగ్యం, వైద్యపరమైన ఖర్చుల కారణంగా ఆ వ్యక్తి జీవనోపాధి పొందే స్థితిలో లేరని, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 […]

Bombay High Court : అనారోగ్యం కారణంగా సంపాదించుకోలేని స్థితిలో జీవనం గడుపుతున్న మీ మాజీ భర్తకు మీరే భరణం చెల్లించాలంటూ.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళను బాంబే హైకోర్టు ఆదేశించింది. జీవనం గడపడం కోసం, వైద్య ఖర్చుల కోసం అతనికి నెలకు రూ.10 వేల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.

అనారోగ్యం, వైద్యపరమైన ఖర్చుల కారణంగా ఆ వ్యక్తి జీవనోపాధి పొందే స్థితిలో లేరని, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి తగిన సంపద కలిగి ఉన్న జీవిత భాగస్వామి మధ్యంతర భరణం చెల్లించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు వివరించింది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

సదరు భర్త, భార్యలకు గొడవలు జరగడంతో గతంలో విడిపోయారు. అనంతరం భార్య బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతుండగా.. భర్త అనారోగ్యం పాలై ఉద్యోగం, ఉపాధి కోల్పోయాడు. దాంతో భార్య నుంచి భరణం కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో.. అతని భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా సివిల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.