Site icon vidhaatha

LPG Gas Cylinders | లోక్‌సభ ఎన్నికల వేళ.. స్వల్పంగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG Gas Cylinders | చమురు కంపెనీలు కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను సవరించాయి. దాంతో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.19 వరకు తగ్గింది. దాంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.1,745.50కి తగ్గింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గడం ఇదిరెండోసారి. గత నెలలోనూ కమర్షియల్‌ సిలిండర్ ధర రూ.30.50 తగ్గిన విషయం తెలిసిందే. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1994.50గా ఉన్నది. కోల్‌కతాలో రూ.1859కి తగ్గింది. ముంబయిలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా ఉన్నది. మరో వైపు గృహ వినియోగ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.

14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855గా కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. ఇంధన ధరలను కట్టడి, నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మండిపడుతున్నది. గతంలో ఎన్నడూలేనివిధంగా పెరిగిన ధరలు.. ఇటీవల ఎన్నికల వేళ తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ధరల తగ్గింపునకు కంపెనీలు ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. అయితే, అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాల్లో మార్పులు, సరఫరా డిమాండ్‌ తదితర అంశాలు ధరల సర్దుబాటుపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా గ్యాస్‌ ధరలను నెలవారీగా కంపెనీలు సమీక్షిస్తూ ధరలను సవరిస్తూ ఉంటాయి.

Exit mobile version