LPG Price | మరోసారి తగ్గిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై ఎంతంటే..?

LPG Price | వరుసగా నాలుగో నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. జూలై నెల ప్రారంభం కావడంతో సోమవారం దేశంలోని చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30 తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,646కి చేరింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

  • Publish Date - July 1, 2024 / 10:37 AM IST

LPG Price : వరుసగా నాలుగో నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. జూలై నెల ప్రారంభం కావడంతో సోమవారం దేశంలోని చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30 తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,646కి చేరింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

అయితే, గృహోపకరణ గ్యాస్ (డొమెస్టిక్) సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు. గత రెండేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.100 తగ్గించింది.

డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రేటు తగ్గడం అదే చివరిసారి. అప్పటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. తాజాగా వాణిజ్య గ్యాస్ ధర మాత్రమే తగ్గడంతో.. రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటివి నిర్వహించే వారు ప్రయోజనం పొందనున్నారు. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.30 తగ్గి రూ.1,646 కి చేరుకుంది. చెన్నైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.31 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ధర రూ.1,809.50 కి చేరింది.

కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.31 తగ్గి రూ.1756 కు, ముంబైలో రూ.31 తగ్గి రూ.1598 కి వాణిజ్య సిలిండర్ ధరలు చేరాయి. బీహార్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1884.50 కు చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గింది. దీంతో గత నెలలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,903.50 కాగా.. ప్రస్తుతం రూ.1,872.50 కి చేరింది. విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.32 తగ్గింది. దాంతో ప్రస్తుతం 19 కిలోల సిలిండర్ ధర రూ.1,832.50 కి చేరింది.

Latest News