Sharjeel Imam | విద్యార్థి కార్యకర్త షర్జీల్‌ ఇమామ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌

సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, విద్యార్థి నేత షర్జీల్‌ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో ఆయన 2020 జనవరి నుంచి కస్టడీలో ఉన్నారు

2020 జనవరి నుంచి కస్టడీలో ఉన్న ఇమామ్‌

న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, విద్యార్థి నేత షర్జీల్‌ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో ఆయన 2020 జనవరి నుంచి కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ పోలీసులు, ఇమామ్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ సురేశ్‌కుమార్ కెయిట్‌, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌ ధర్మాసనం ఆయనకు బెయిల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాను 2020 జనవరి నుంచి కస్టడీలో ఉన్నందున ఈ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని తనకు చట్టబద్ధమైన బెయిల్‌ మంజూరు చేయాలని ఇమామ్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. 2019 డిసెంబర్‌ 13న జామియా మిలియా యూనివర్సిటీలో, 2019 డిసెంబర్‌ 16న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో వివాదాస్పద ఉపన్యాసాలు చేశాడని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది.

అసోం, మిగిలిన ఈశాన్య భారతాన్ని ముక్కలు చేస్తానని ఆయన బెదిరించాడని పేర్కొన్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడని తెలిపింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌ అయిన ఇమామ్‌పై ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ కేసు నమోదు చేశారు. తొలుత రాజద్రోహం కింద కేసు నమోదు చేసినా.. తర్వాత యూఏపీలోని సెక్షన్‌ 13 కింద వేరే కేసు జోడించారు. 2020 జనవరి 28వ తేదీ నుంచి ఇమామ్‌ కస్టడీలోనే ఉన్నాడు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌ అయిన ఇమామ్‌పై ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ కేసు నమోదు చేశారు.

తొలుత రాజద్రోహం కింద కేసు నమోదు చేసినా.. తర్వాత యూఏపీలోని సెక్షన్‌ 13 కింద వేరే కేసు జోడించారు. 2020 జనవరి 28వ తేదీ నుంచి ఇమామ్‌ కస్టడీలోనే ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు విచారణ కోర్టు తిరస్కరించింది. ప్రాసిక్యూషన్‌ వాదన విన్న తర్వాత అసాధారణ పరిస్థితుల్లో ఆయన కస్డీని మరింత పొడిగించవచ్చని పేర్కొన్నది. తనపై మోపిన అభియోగాలు రుజువైతే తనకు ఏడేళ్లు శిక్ష పడుతుందని, కానీ తాను ఇప్పటికే గరిష్ఠంగా నాలుగేళ్లు జైల్లో ఉన్నందున తనకు బెఇయల్‌ ఇవ్వాలని విచారణ కోర్టును ఇమామ్‌ కోరాడు. సీఆర్పీసీ సెక్షన్‌ 436 ఏ ప్రకారం ఒక వ్యక్తి తనకు పడే జైలు శిక్షలో సగం సమయం కస్టడీలో ఉంటే ఆయనను విడుదల చేయవచ్చని పేర్కొంటున్నది.