Priyanka Gandhi | ప్రియాంకాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకోనిది అందుకేనట..!

Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రియాంకాగాంధీని బరిలో దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆమె విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్‌ దాఖలు మే 3 (శుక్రవారం) తో గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వరకు కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేయననే తన మాటకే కట్టుబడి ఉన్నారు. దాంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆఖరికి రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీని, అమేథీ నుంచి కిశోరీలాల్‌ శర్మను బరిలో దించుతున్నట్లు ప్రకటించింది.

  • Publish Date - May 3, 2024 / 11:31 AM IST

Priyanka Gandhi : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రియాంకాగాంధీని బరిలో దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆమె విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్‌ దాఖలు మే 3 (శుక్రవారం) తో గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వరకు కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేయననే తన మాటకే కట్టుబడి ఉన్నారు. దాంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆఖరికి రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీని, అమేథీ నుంచి కిశోరీలాల్‌ శర్మను బరిలో దించుతున్నట్లు ప్రకటించింది.

అయితే ఎన్నికల్లో పోటీకి చాలామంది తహతహలాడుతుంటారు. పార్టీ టికెట్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తమకు టికెట్‌ దక్కుతుందా.. లేదా..? అని ఆఖరి నిమిషం వరకు టెన్షన్‌ పడుతారు. ఒకవేళ పార్టీ టికెట్‌ దక్కకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి టికెట్‌ దక్కించుకునే ప్రయత్నానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. మరె అలాంటిది ప్రియాంకాగాంధీ ఏకంగా పార్టీ హైకమాండ్‌ బతిమాలినా పోటీకి ఎందుకు నిరాకరించినట్లు..? ఆఖరి నిమిషం వరకు హైకమాండ్‌ ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించాలని ప్రయత్నించినా ఎందుకు ససేమిరా అన్నట్లు..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికి వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అని ఆరోపణలు చేస్తుండటంవల్లే ప్రియాంకాగాంధీ ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తంచేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తన తల్లి, సోదరుడు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇప్పుడు తాను కూడా పార్లమెంటులో అడుగుపెడితే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుందని ప్రియాంకాగాంధీ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చెప్పినట్లు తెలుపుతున్నాయి. అందుకే ఆఖరికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమె అభిప్రాయాన్ని గౌరవించి రాహుల్‌గాంధీ, కిశోరీలాల్ శర్మలను ఆ రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిందని పేర్కొన్నాయి.

Latest News