విధాత: దేశ రాజధాని ఢిల్లీ గురువారం మధ్యాహ్నం భూ ప్రకంపనలతో వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు అయింది. ఢిల్లీతోపాటు జమ్ముకశ్మీర్, పాకిస్థాన్‌లోని తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం తెలియరాలేదు. పంజాబ్, చంఢీఘడ్, ఘజియాబాద్, పిర్‌పాంచాల్ దక్షిణ ప్రాంతంలోను ప్రకంపనలు వచ్చాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
జనవరి 1వ తేదీన జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపతో రెండు వందల మంది మరణించగా, వంద మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అండమాన్ సముద్రంలోనూ భూమి కంపించింది.