Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపే (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ నెల 20న (రేపు) ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రానికి ప్రచారం ముగిసింది. మొత్తం 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. ఐదో దశలో యూపీలోని 14 లోక్‌సభ స్థానాలకు, మహారాష్ట్రలోని 13 లోక్‌సభ స్థానాలకు, బెంగాల్‌లోని ఏడు లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 5 లోక్‌సభ స్థానాలకు, బీహార్‌లోని 5 లోక్‌సభ స్థానాలకు, జార్ఖండ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు, జమ్ముకశ్మీర్, లఢక్‌లలో ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్‌కు కీలక స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథిలో కూడా రేపే పోలింగ్ నిర్వహించనున్నారు. రాయబరేలీలో రాహుల్‌గాంధీ, అమేథిలో సీనియర్ నేత కేఎల్ శర్మ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. ఐదో దశ ఎన్నికల్లో బరిలో నిలిచిన ప్రముఖుల్లో రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ ఉన్నారు.