న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(SIR) ను సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ నేడు బుధవారం కొనసాగనుంది. ఈ కేసు వేసిన సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించేందుకు అనుమతించాలంటూ సీజేఐ సూర్యకాంత్ ను కోరారు. ఆయన అనుమతించిన పక్షంలో కొద్ది సేపట్లో సీఎం మమత బెనర్జీ న్యాయవాదిగా మారి కేసులో తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.
అదే జరిగితే దేశ చరిత్రలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి న్యాయవాదిగా మారి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తన కేసు వాదించనుండటం చరిత్రగా మిగిలిపోనుంది. ఎస్ఐఆర్ ముసుగులో బెంగాల్ లో ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా 50లక్షల మందికి పైగా ఓటర్లను తొలిగించే కుట్ర చేస్తుందని మమత ఆరోపిస్తున్నారు.
