బాలిక‌ను కాటేసిన స్నేక్.. పామును ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన కుటుంబ స‌భ్యులు

ఓ బాలిక‌ను పాము కాటేసింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు బాలిక‌తో పాటు పామును కూడా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆస్ప‌త్రిలో ఉన్న రోగులు పామును చూసి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని చందేయ్ తానా జిల్లాలో వెలుగు చూసింది.

  • Publish Date - May 17, 2024 / 11:00 AM IST

పాట్నా : ఓ బాలిక‌ను పాము కాటేసింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు బాలిక‌తో పాటు పామును కూడా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆస్ప‌త్రిలో ఉన్న రోగులు పామును చూసి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని చందేయ్ తానా జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. చందేయ్ తానా జిల్లాలోని దులాత్‌పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక త‌న ఇంటికి స‌మీపంలో పువ్వుల‌ను తెంపుతుండ‌గా, ఓ పాము కాటేసింది. పాము కాటును భ‌రించ‌లేని బాలిక గ‌ట్టిగా ఏడ్చింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు బాలిక‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అనంత‌రం కాటేసిన పామును కూడా ప‌ట్టుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

బాలిక‌ను జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన చికిత్స నిమిత్తం బీహార్ ష‌రీఫ్ స‌దార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే పామును ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా, అక్క‌డున్న రోగులు, సిబ్బంది షాక్ అయ్యారు. పాము ప్లాస్టిక్ డ‌బ్బాలో నుంచి త‌ప్పించుకోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన రోగులు ప‌రుగులు తీశారు. మొత్తానికి మ‌ళ్లీ ఆ పామును ప‌ట్టి అట‌వీశాఖ అధికారుల‌కు అప్ప‌గించారు.

హాస్పిట‌ల్‌కు పామును ఎందుకు తీసుకెళ్లారంటే..?

బాలిక‌ను ఏ పాము కాటేసిందో తెలుసుకుంటే, దానికి త‌గ్గ వైద్యం అందిస్తార‌నే ఉద్దేశంతో కుటుంబ స‌భ్యులు ఆ పామును బంధించి ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. ప్ర‌స్తుతం బాలిక ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.

Latest News