BUDJET 2024 | స్టాక్‌మార్కెట్‌ను ముంచిన ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగంలోని ఐదు అంశాలు!

స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారి విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఐదు పన్ను ప్రతిపాదనలు దలాల్‌ స్ట్రీట్‌లో బలమైన అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠస్థాయి నుంచి పతనమైంది.

  • Publish Date - July 23, 2024 / 04:40 PM IST

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారి విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఐదు పన్ను ప్రతిపాదనలు దలాల్‌ స్ట్రీట్‌లో బలమైన అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠస్థాయి నుంచి పతనమైంది. ఈక్విటీ, ఇండెక్స్‌ ట్రేడ్లపై ఎస్టీటీ పన్నును ఆర్థిక మంత్రి రెట్టింపు చేశారు. పదిశాతంగా ఉన్న లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ (LTCG) పన్నును 12.50శాతానికి పెంచారు. షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ (STCG) పన్నును సైతం 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు.

స్టాక్‌మార్కెట్‌ పతనానికి ఐదు ప్రధనాంశాలివే!

1. వ్యుత్పన్న ట్రేడ్‌ derivative trade పై ఎస్టీటీ రేటు పెంపుదల

ఈక్విటీ, ఇండెక్స్‌ ట్రేడ్‌ ఎస్టీటీ రేటును నిర్మలా సీతారామన్‌ 0.01 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. ‘ట్యాక్స్‌ బేస్‌ను పెంచేందుకు నేను కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాను. మొదటిది.. ఫ్యూచర్స్‌, సెక్యూరిటీ ఆప్షన్స్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్‌ పన్నులను 0.02 శాతానికి, 01 శాతానికి పెంచుతున్నాం’ అని నిర్మల ప్రకటించారు.

2. ఎస్టీసీజి పన్ను పెంపుదల

‘షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ (STCG) పన్నును 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నాం. నిర్దిష్ట ఫైనాన్షియల్‌ అసెట్స్‌పై షార్ట్‌ టర్మ్‌ గెయిన్స్‌ ఇక నుంచి 20శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. అదే సమయంలో ఇతర అన్ని ఫైనాన్షియల్‌ అసెట్స్‌పై, అన్ని నాన్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌పై వర్తించే రేటు కొనసాగుతుంది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

3. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ (LTCG) పన్నులో మార్పు

ఎల్టీసీజీ పన్నును పది శాతం నుంచి 12.50 శాతానికి ఆర్థిక మంత్రి పెంచారు. ‘అన్ని ఫైనాన్షియల్‌ అసెట్స్‌, అన్ని నాన్‌ఫైనాన్షియల్‌ అసెట్స్‌పై లాంగ్‌టర్మ్‌ గెయిన్స్‌కు ఇకపై 12.5 శాతం పన్ను వర్తిస్తుంది’ అని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

4. లిస్టెడ్‌, నాన్‌లిస్టెడ్‌ అసెట్స్‌ వర్గీకరణ

లాన్‌ లిస్టెడ్‌ అసెట్స్‌ వర్గీకరణ కాల పరిమితిని నిర్మలా సీతారామన్‌ ఏడాది నుంచి రెండేళ్లకు పెంచారు. మరోవైపు ఈక్విటీలు సహా లిస్టెడ్‌ అసెట్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా వదిలిపెట్టారు.

5. బైబ్యాక్‌ షేర్లపై పన్ను నిబంధనల్లో మార్పు

‘గ్రహీత చేతుల్లోని బైబ్యాక్‌ షేర్లపై లభించే ఆదాయంపై పన్ను ప్రతిపాదిస్తున్నాను’ అని నిర్మల ప్రకటించారు.
ప్రస్తుత పన్ను విధానంలో షేర్‌హోల్డర్లకు బైబ్యాక్‌ షేర్ల నుంచి లభించే ఆదాయంపై  ఆదాయం పన్ను మినహాయింపు ఉన్నది. 

నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమర్పణ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌ తీవ్రంగా పతనమైంది. సెన్సెక్స్‌, నిఫ్టీ గణనీయ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎస్ అండ్‌ పీ బీఎస్ఈ సెన్సెక్స్‌ 80వేలకు దిగువకు పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 409 పాయింట్లకు తగ్గింది.