Viral | హార్డ్‌వేర్‌ హార్డ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఈజ్‌ సాఫ్ట్‌..! పరీక్షల్లో విద్యార్థి వింత సమాధానాలు.. జాతిరత్నమే అంటున్న నెటిజన్స్‌..!

  • Publish Date - April 1, 2024 / 11:06 AM IST

Viral | సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందులో కొందరు తమ చిలిపి పనులతో జనాలను నవ్విస్తుంటారు. మరికొందరు ఆలోచింపజేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్షల్లో రాసే చిలిపి జవాబులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. సాధారంగానే విద్యార్థులు పరీక్షలంటేనే కాస్త భయాందోళనలకు గురవుతారు. కొందరు ఎగ్జామ్స్‌కు ముందు ప్రణాళికతో ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతారు. మరికొందరు ఏదో వెళ్లి పరీక్ష రాసివచ్చాం అన్నట్లుగా ఉంటారు. అయితే, తాజాగా పరీక్షకు హాజరైన విద్యార్థి ఓ ప్రశ్నకు రాసిన సమాధానం చూసి ఖంగుతిన్నాడు. సదరు ఉపాధ్యాయుడు ఆ కళాఖండాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఆ కళాఖండం ఏంటో తెలుసుకుందాం రండి..!

సాధారంగా పరీక్షల్లో ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. చాలా మంది ఏదో తెలియకపోయినా సినిమా స్టోరీయో.. పాటలు.. కథలు.. లేకపోతు ఉపాధ్యాయుడిని కాకపట్టేందుకు ఏవో ఇబ్బందులను చెబుతూ జవాబులు రాసింది చూసే ఉంటాం. ఇదే తరహాలో ఓ విద్యార్థి సైతం ఇదే పని చేశాడు. ఎగ్జామ్‌ పేపర్‌లో ‘హార్డ్‌వేర్‌-సాఫ్ట్‌వేర్‌’కి మధ్య ఐదుతేడాల గురించి రాయమని కోరగా.. విద్యార్థి మాత్రం దిమ్మతిరిగే సమాధానాలు రాశాడు. వీటిని చదివిన ఉపాధ్యాయుడు మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఇంతకు ఆ విద్యార్థి ఏం రాశాడంటే.. ‘హార్డ్‌వేర్‌ హార్డ్‌గా ఉంటుంది.. సాఫ్ట్‌వేర్‌ సాఫ్ట్‌గా ఉంటుంది. హార్డ్‌ ఈజ్‌ హార్డ్‌, సాఫ్ట్‌వేర్‌ వేర్‌.. తేడా ఏం లేదు. హార్డ్‌వేర్‌ ఈజ్‌ డిఫరెంట్‌.. సాఫ్ట్‌వేర్‌ కూడా భిన్నంగా ఉంటుంది. హార్డ్‌వేర్‌ ఈజ్‌ వెరీ హార్డ్‌, సాఫ్ట్‌వేర్‌ బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. హార్డ్‌వేర్‌ సాఫ్ట్‌ కాదు.. సాఫ్ట్‌వేర్‌ హార్డ్‌ కాదు’ అంటూ రాసుకొచ్చాడు. సదరు విద్యార్థి తనకు తోచినట్లుగా.. సార్‌ చూస్తాడో లేదో.. లేకపోతే ఎన్నో కొన్ని మార్కలు వేయలేకపోతాడా? అన్న వింత సమాధానాలు రాశాడు.
ఈ కళాఖండాన్ని చూసిన ఉపాధ్యాయుడు ఆ జాతిరత్నం ఆన్సర్‌ షీట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. అయితే, ఎక్కడిదో మాత్రం తెలియరాలేదు. డాక్టర్‌ జీఆర్‌ రాఘవేందర్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే, ఇది పాతదే అయినా మరోసారి నెట్టింట వైరల్‌ అవుతున్నది. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ విద్యార్థి సైతం ఉపమాల అలంకారం గురించి రాయమంటే..‘ఉప్మా తయారీ విధానం’ గురించి రాసుకొచ్చాడు. ఇది చూసిన ఉపాధ్యాయుడు బిత్తరపోయాడు. సోషల్‌ మీడియాలో సదరు విద్యార్థులను నిజమైన జాతిరత్నాలు అంటూ స్పందిస్తున్నారు.

 

 

 

Latest News