ICMR | డయాబెటిక్‌ రోగులకు ఈ పరీక్షలు తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..!

  • Publish Date - April 6, 2024 / 10:20 AM IST

ICMR | మధుమేహం నిర్ధారణ అయిన ఐదు సంవత్సరాల తర్వాత రోగులకు పాదాలు, కంటి పరీక్షలను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వైద్యులతో టైప్‌-1 డయాబెటిక్‌ రోగుల చికిత్సకు సంబంధించిన పోట్రోకాల్‌ను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ జారీ చేసింది. ఇందులో కొత్తగా మధుమేహం నిర్ధారణ అయిన, పాత రోగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) శాస్త్రవేత్తలు స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌ వర్క్‌ఫ్లో (STW)ని సిద్ధం చేసి వైద్యులకు పంపింది. డయాబెటిక్ రోగులను ఉన్నత స్థాయి ఆసుపత్రులకు రెఫర్ చేసేందుకు ఇందులో ప్రమాణాలను సైతం సూచించింది.

అనియంత్రిత హైపోగ్లైసీమియా విషయంలో రోగులను రెఫర్‌ చేయవచ్చు. రోగి తన రక్తంలో చాలా షుగర్‌ (గ్లూకోజ్‌) లెవల్‌ ఉన్నప్పుడు ఉన్న సమయంలో రెఫర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పాటు రోగి కుటుంబానికి ఇన్సులిన్‌ శిక్షణ, దీర్ఘకాలిక మధుమేహం, ఇంట్లో పర్యవేక్షణ పద్ధతి, తీవ్రమైన డయాబెటిక్‌ కీటోయాసిడోసిస్‌ (DKA) విషయంలో రెఫల్‌ చేయవచ్చు. కొత్త ప్రోటోకాల్స్‌ ప్రకారం.. మధుమేహం నిర్ధారణ అయిన ఐదు సంవత్సరాల తర్వాత రోగి వైద్య సలహా కోసం వచ్చిన సమయంలో ఫండోస్కోపీ (రెటినా టెస్ట్‌), న్యూరోపతి (పాదాలు), మూత్రం, క్రియేటినిన్‌ నిష్పత్తి, థైరాయిడ్‌ అండ్‌ లిపిడ్‌ ప్రొఫైల్‌ టీఎస్‌హెచ్‌ టెస్ట్‌ తప్పనిసరి చేసింది. ఆయా టెస్టులతో ఐదేళ్ల తర్వాత మధుమేహం రోగికి ఎంత, ఎలాంటి నష్టాలను కలిగించిందో సులభంగా తెలుసుకునే వీలుండనున్నది.

Latest News