India Born Cheetah Mukhi : మన చీతా తల్లైంది…’ప్రాజెక్ట్ చీతా’లో చారిత్రక ఘట్టం

మధ్యప్రదేశ్ కూనో పార్కులో చీతా ‘ముఖి’ ఐదు కూనలకు జన్మనివ్వడం ప్రాజెక్ట్ చీతాలో చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇది భారత్‌లో పునర్జన్మించిన తొలి చీతా వంశం.

India Born Cheetah Mukhi

న్యూఢిల్లీ : ఇండియాలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ ప్రయత్నాల్లో కీలక మైలురాయి నమోదైంది. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో దేశీయ చీతా ‘ముఖి’ తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాకు భారత్‌లో జన్మించి, సంతానోత్పత్తి చేసిన మొట్టమొదటి చీతా ఇదే కావడం విశేషం. తల్లి చీతా సహా కూనలు ఆరోగ్యంగా ఉన్నాయని..ఇది వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలకు గొప్ప ప్రోత్సాహకం అని కేంద్ర పర్యావరణ శాఖ ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

భారత్ లో జన్మించిన చీతా విజయవంతంగా పునరుత్పత్తి చేయడం ఇదే ప్రథమం. దేశంలోని ఆవాసాలకు చీతాలు అలవాటు పడుతున్నాయని, దేశంలో స్వయం సమృద్ది, జన్యుపరమైన వైవిధ్యమైన చీతాల జనాభా పునరుద్దరణకు ఇది బలమైన సంకేతం అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. దేశ ఆవాసాల్లో తమ జాతులు జీవన సామర్థ్యానికి, అభివృద్ధికిబలమైన నిదర్శనం అని పేర్కొన్నారు.

Latest News