Project Cheetah India| ప్రాజెక్టు చీతాలో మరో పురోగతి.. కునో పార్కులో మూడు చీతా కూనల జననం

భారత్ లో అంతరించిపోయిన చీతా చిరుత పులుల జాతీ పునరుద్దరణకు కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు చీతా వేగంగా సత్ఫలితాలనిస్తూ పురోగమిస్తుంది. తాజాగా కునో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికా చిరుత గామిని రెండో సారి తల్లి కాగా..కొత్తగా మూడు చీతా కూనలకు జన్మనిచ్చింది. భారతదేశంలోని మొత్తం చిరుత జనాభా ఇప్పుడు 38కి చేరుకుంది.

విధాత : భారత్ లో అంతరించిపోయిన చీతా చిరుత పులుల జాతీ పునరుద్దరణకు కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు చీతా వేగంగా సత్ఫలితాలనిస్తూ పురోగమిస్తుంది. తాజాగా కునో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికా చిరుత గామిని రెండో సారి తల్లి కాగా..కొత్తగా మూడు చీతా కూనలకు జన్మనిచ్చింది. కూనో పార్కుకు దక్షిణాఫ్రికా నుండి చిరుతలు వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు కొత్త చిరుత పిల్లలు పుట్టడంతో పార్కు సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు.

భారత గడ్డపై చీతా ప్రాజెక్టులో భాగంగా దిగుమతి చేసుకున్న చీతాలలో ఇప్పటికి తొమ్మిది సార్లు సంతానం కలుగగా..భారతదేశంలో జన్మించిన చీతా కూన పిల్లల సంఖ్యను 27కి పెరిగింది. అలాగే భారతదేశంలోని మొత్తం చిరుత జనాభా ఇప్పుడు 38కి చేరుకుంది.

కొత్తగా కునో పార్కులో మూడు చీత కూనల జననంపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన ట్వీట్ లో అభినందనలు తెలిపారు. ఇది ప్రాజెక్ట్ చీతా ఫీల్డ్ సిబ్బంది, పశువైద్య బృందాల ఉత్తమ పనితీరుకు నిదర్శనమని ట్వీట్ చేశారు. చీతాల పునురుజ్జీవనంలో దేశం దృఢ నిశ్చయాన్ని, చారిత్రాత్మక పరిరక్షణ ప్రయత్నానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు.ప్రతి చీతా జననం ప్రాజెక్ట్ చీతా పునాదిని బలపరుస్తుంది అన్నారు. కునో పార్కుభారతదేశానికి గర్వకారణమైన క్షణాలను అందించిందని, తల్లి చీతా గామిని, దాని ముగ్గురు చిన్న స్ప్రింటర్లు బలంగా ఎదగాలని, దేశం చిరుత పునరుజ్జీవన ప్రస్థానాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశించారు.

 

Latest News