Cheetah Project| కునో పార్కులో 5 చీతాలకు జన్మనిచ్చిన జ్వాలా
చీతా ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన జ్వాలా అనే చీతా మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ ఉద్యాన వనంలో ఐదు కూనలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 53కు చేరింది.
విధాత : చీతా ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన జ్వాలా అనే చీతా మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ ఉద్యాన వనంలో ఐదు కూనలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 53కు చేరింది. ఇందుకు సంబంధించిన ఫోటోను కేంద్ర పర్యావరణ మంత్రి భూపెందర్ యాదవ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇటీవల గామిని అనే చీతా నాలుగు చీతా కూనలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
జ్వాల ఇప్పటివరకు మూడు దఫాలుగా చీతా కూనలకు జన్మనిచ్చిందని, తాజాగా జన్మించిన పిల్లతో కలిపి భారత్ లో పుట్టిన చీతా పిల్లల సంఖ్య 33కు చేరిందని మంత్రి భూపెందర్ యాదవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Gold, Silver Prices| పెరిగిన బంగారం, వెండి ధరలు
Vegetables Cultivation | నెలకు 3000 కిలోల కూరగాయలు పండిస్తున్న యువ రైతు.. ఆదాయం రూ. 2 లక్షలకు పైనే..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram