Cheetah | మూడు కూనలకు జన్మనిచ్చిన ‘గామిని’
Cheetah | మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో సౌతాఫ్రికా చీతాలు..తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. తాజాగా గామిని అనే చీతా.. మూడు కూనలకు జన్మనిచ్చింది.
Cheetah | మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో సౌతాఫ్రికా చీతాలు..తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. తాజాగా గామిని అనే చీతా.. మూడు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాజాగా మూడు కూనలకు జన్మనిచ్చిన గామినిని 2023లో సౌతాఫ్రికా నుంచి కునో జాతీయ పార్కుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చీతాల సంఖ్య 38కి చేరిందని ఆయన తెలిపారు. దేశంలో చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధికి కృషి చేస్తున్న ఫీల్డ్ సిబ్బంది, డాక్టర్లను కేంద్ర మంత్రి అభినందించారు.
గామిని మూడు కూనలకు జన్మనివ్వడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యంలో ఇది దేశానికే చరిత్రాత్మక విజయమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా.. ఈ నెల ప్రారంభంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుత ఆశా ఇదే పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram