- తాజ్‌మహల్ సందర్శనకు వచ్చినప్పుడు ఘటన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
విధాత: కండ్ల ముందే కన్నతండ్రి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఏ కొడుకుకు అయినా కాళ్లు చేతులు ఆడవు. షాక్‌లోనే ఉండిపోతాడు. కానీ, ఇండియన్ నేవి ఆఫీసర్ అయిన ఆ కొడుకు వెంటనే స్పందించారు. సీపీఆర్ చేసి తన తండ్రి ప్రాణాలను కాపాడారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తండ్రిని దవాఖానకు తరలించారు. సీపీఆర్‌తో తన తండ్రి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
आगरा
➡ताजमहल के अंदर CPR देते का लाइव वीडियो वायरल
➡पर्यटक को सीपीआर देते का लाइव वीडियो हुआ वायरल
➡ताजमहल देखने आए पर्यटक को आया था हार्ट अटैक
➡काफी देर तक CPR देने के बाद पर्यटक की लौटी जान
➡ताजमहल परिसर के अंदर वीडियो प्लेटफार्म का मामला.#Agra pic.twitter.com/hRxTtDwXIu
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 15, 2023
అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన 70 ఏండ్ల రామ్‌రాజు తన కుటుంబంతో ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను చూసేందుకు బుధవారం వచ్చారు. మధ్యాహ్నం వేళ తాజ్‌మహల్ ఆవరణలోనే ఒక్కసారిగా గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోయారు. నౌకాదళంలో అధికారి అయిన ఆయన కుమారుడు వెంటనే బకార్డియో-పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశారు.
తండ్రి గుండెపై పలుమార్లు నొక్కుతూ, నోటి ద్వారా శ్వాస అందించారు. మరొకరు రామ్‌రాజు అరికాళ్లను రుద్దారు. ముఖంపై నీళ్లు చల్లారు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆయనను సమీపంలోని మిలటరీ దవాఖానకు తరలించారు. తండ్రికి కొడుకు సీపీఆర్ చేస్తుండగా, పర్యాటకులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో వైరల్‌గా మారింది.