Indian Railway | జరిమానాల ద్వారా రైల్వేకు దండిగా ఆదాయం.. 46.26లక్షల మందికి రూ.300కోట్లు ఫైన్‌..!

Indian Railway | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. నిత్యం లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు ఛార్జీలు సైతం తక్కువగా ఉండడంతో సామాన్యులు ఎక్కువగా రైలులోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, రైల్వేలో నిబంధనలు కఠినంగానే ఉంటాయి. ఉల్లంఘిస్తే పలు సార్లు జరిమానాతో పాటు జైలుశిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఎక్కువగా రైల్వేలను వినియోగించుకుంటారు. చాలా మంది తమ ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్లను బుక్‌ చేసుకుంటారు. అయితే, అడ్వాన్స్‌డ్‌ […]

Indian Railway | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. నిత్యం లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు ఛార్జీలు సైతం తక్కువగా ఉండడంతో సామాన్యులు ఎక్కువగా రైలులోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, రైల్వేలో నిబంధనలు కఠినంగానే ఉంటాయి. ఉల్లంఘిస్తే పలు సార్లు జరిమానాతో పాటు జైలుశిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఎక్కువగా రైల్వేలను వినియోగించుకుంటారు. చాలా మంది తమ ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్లను బుక్‌ చేసుకుంటారు. అయితే, అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌కు సైతం భారీగా పోటీ ఉండడంతో చాలామందికి టికెట్ల దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో కొందరు అత్యవసర సమయాల్లో టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. టికెట్లు లేని ప్రయాణం నేరమని.. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ హెచ్చరించినా.. చాలామంది టికెట్ల లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో రైల్వేశాఖ రూ.300కోట్లను జరిమానాలుగా విధించింది. సెంట్రల్‌ రైల్వే 2023-24 మధ్య 46.26లక్షల మంది ప్రయాణికులు టికెట్లు లేని ప్రయాణం, బుక్‌ చేయని లగేజీ కేసులపై చర్యలు చేపట్టింది. సెంట్రల్ రైల్వే 46.26 లక్షల కేసుల్లో జరిమానాల ద్వారా రూ.300 కోట్లు ఆర్జించింది. ఇది అన్ని రైల్వే జోన్‌ల కంటే ఎక్కువ. ఈ ఏడాది రూ.265.97 కోట్ల ఆదాయ లక్ష్యంలో 12.80 శాతం వృద్ధి నమోదుకాగా.. కేసుల లక్ష్యం 8.38 శాతం పెరిగిందని సెంట్రల్ రైల్వే పేర్కొంది. జరిమానాలు, ఆదాయం పరంగా అన్ని జోన్లలో మొదటి స్థానంలో నిలిచినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 20.56 లక్షల టిక్కెట్‌లు లేని సక్రమంగా ప్రయాణించే కేసుల ద్వారా సెంట్రల్ రైల్వేలోని ముంబయి డివిజన్ రూ.115.29 కోట్లు ఆర్జించింది. భూసావల్ డివిజన్‌లో 8.34 లక్షల కేసుల ద్వారా రూ.66.33 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, నాగ్‌పూర్ డివిజన్‌లో 5.70 లక్షల కేసుల్లో రూ.34.52 కోట్లు, షోలాపూర్ డివిజన్‌లో 5.44 లక్షల కేసులులు నమోదు కాగా.. రూ.34.57 కోట్లు, పూణే డివిజన్‌లో 3.74 లక్షల కేసుల ద్వారా రూ.28.15 కోట్లు సంపాదించింది.

సెంట్రల్‌ రైల్వే పరిధిలో 22 మంది టికెట్‌ చెకింగ్‌ సిబ్బంది ఉన్నారని.. ఇందులో ఇద్దరు మహిళా ఎగ్జామినర్స్‌ ఉన్నారని సెంట్రల్‌ రైల్వే ప్రతినిధి తెలిపారు. ఇందులో టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ నైనాని 20,117 కేసులు నమోదు చేసి రూ.1.92కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండో స్థానంలో 18,223 కేసుల నుంచి రూ.1.59 కోట్లు ఆర్జించిన టికెట్ ఇన్‌స్పెక్టర్ ఎంఎం షిండే రెండో స్థానంలో ఉండగా.. 17,641 కేసుల నుంచి రూ.1.52 కోట్లు ఆర్జించిన ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర కుమార్ మూడో స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డివిజన్‌లో రైళ్లలో చైన్‌పుల్లింగ్‌కు పాల్పడినందుకు 2,266 మంది ప్రయాణికులపై రైల్వే శాఖ చర్యలు చేపట్టి రూ.8,35,165 జరిమానా వసూలు చేసినట్లు ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో 647 మందిపై చర్యలు తీసుకుని రూ.90,830 జరిమానా వసూలు చేశారు. మధుర జంక్షన్‌లో 1,347 మందిపై చర్యలు తీసుకోగా రూ.5,76,140 స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ధోల్‌పూర్ స్టేషన్‌లో 120 మంది నుంచి రూ.67,700 జరిమానా వసూలు చేశారు. రైళ్ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఆగ్రా డివిజన్‌లోని వాణిజ్య విభాగం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి.