Jammu kashmir Cloudburst | న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బరెస్టు(మెరుపు వరదలు)తో (Jammu Kashmir Kishtwar Cloudburst)సంభవించిన భారీ వరదలతో 30మందికి పైగా మృతి చెందారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో కొండచరియలు విరిగి పడ్డాయి. వరదల ధాటికి భక్తుల టెంట్లు కొట్టుకపోయాయి. 25మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. వరదల తీవ్రత కారణంగా మచైల్ మాత యాత్రను నిలిపివేశారు. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి 98మందిని కాపాడగా.. వీరిలో 28మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు.
మాచైల్ మాతా మందిరం యాత్ర జులై 25నమొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడకు వచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. ఈ పెను విషాదం నేపథ్యంలో మాచైల్ యాత్రను నిలిపివేశారు.రాంబస్ జిల్లాలోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ముగ్గురు మరణించినట్లుగా సమాచారం. 40ఇళ్లు దెబ్బతిన్నాయి. 100మందికి ప్రజలను రక్షించారు. ఢిల్లీలోని భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఓ భారీ వృక్షం కూలి కారు, బైకర్ పై పడగా..బైకర్ మృతి చెందాడు.
ఇటీవల క్లౌడ్ బరెస్టుతో విధ్వంసమైన ఉత్తర ఖండ్(Uttarakhand) లోని ధరాలీ(Darali) గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖీర్‌గంగా నది ఉప్పొంగి పక్కనే ధరాలీ ముంచెత్తింది. అనేక ఇళ్లు శిథిలమయ్యాయి. 50మంది వరకు గల్లంతయ్యారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే వరుస వర్షాలు ఇబ్బందికరంగా మారాయి.
హిమాచల్‌లో వరద బీభత్సం.. క్లౌడ్‌బరస్ట్‌తో వంతెనలు ధ్వంసం
హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal Pradesh) మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్(Cloudburst) కారణంగా కురిసిన కుండపోత వర్షానికి సిమ్లా, లాహౌల్, స్పితి జిల్లాల్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 300కి పైగా రోడ్లను, రెండు జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. గన్వి రావైన్‌లో వరద నీటికి ఒక పోలీస్ చెక్ పోస్ట్ కొట్టుకుపోయింది. అయితే, ఈ ప్రకృతి విపత్తులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి…