Women’s Graves | జైపూర్ : కొంతమంది నీచానికి పాల్పడుతున్నారు. స్మశాన వాటికల్లో( Graveyards ) మహిళల సమాధులను(Women’s Graves ) టార్గెట్ చేస్తున్నారు. శవాల మీద కప్పి ఉంచిన తెలుపు రంగు వస్త్రాలను( Kafan ) దొంగిలిస్తున్నారు. ఇలా వారి వస్త్రాలను మాయం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్( Rajasthan 0లోని పింక్ సిటీ శాస్త్రి నగర్ ఏరియాలో వెలుగు చూసింది.
శాస్త్రి నగర్ ఏరియాలో ఇస్లామిక్‌కు చెందిన ఓ స్మశాన వాటిక ఉంది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం.. మహిళల శవాలపై తెలుగు రంగు వస్త్రం ఉంచి ఖననం చేస్తారు. అయితే ఆ తెలుపు రంగు వస్త్రాలను కొందరు దుండగులు అపహరిస్తున్నారు. సమాధులను తవ్వి ఈ పనికి పాల్పడుతున్నారు. వస్త్రాలు మాయం అవుతుండడంతో స్థానికులు నిఘా పెంచారు.
అర్ధరాత్రి వేళ సమాధుల్లోకి వెళ్లి మహిళా సమాధుల వద్ద ఉన్న వస్త్రాలను కొంత మంది దుండగులు అపహరిస్తున్నట్లు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. నాలుగైదురు కలిసి ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ వీడియోలే ఇప్పుడు పోలీసుల విచారణలో కీలకం కానున్నాయి. అయితే మహిళా సమాధులను టార్గెట్ చేసి తెలుపు రంగు వస్త్రాలను అపహరించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
స్మశాన వాటికను కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిన్ ఖాగ్జీతో పాటు స్థానిక నాయకులు పరిశీలించారు. బట్టలను అపహరిస్తున్న వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. శాస్త్రి నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.