Graveyard | శృంగారం అనేది నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని. కానీ ఇటీవల కాలంలో కొందరు ఎక్కడంటే అక్కడ.. బహిరంగ ప్రదేశాల్లోనూ శృంగార చర్యలకు పాల్పడుతున్నారు. వాహనాల్లోనూ లైంగిక చర్యలకు పూనుకుంటున్నారు. చివరకు ఓ జంట స్మశాన వాటికను కూడా వదల్లేదు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన స్మశాన వాటికలో శృంగార చర్యకు పాల్పడి జైలు పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌కు చెందిన జోసెఫ్ లూక్ బ్రౌన్(38), స్టీఫనే కేయ్ వెగ్‌మాన్(46) కలిసి చారిత్రాత్మకమైన స్మశాన వాటిక వద్దకు వెళ్లారు. అయితే స్మశాన వాటిక గేట్ వద్ద వెగ్‌మాన్ కారు నిలిపి ఉంచడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లారు. కారు అద్దాలు కిందకు దించి ఉన్నాయి. కారులో ఉన్న డ్రగ్స్.. మెథాంఫెటమైన్, జనాక్స్, ఆక్సికోడోన్ అనే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక పోలీసులకు అనుమానం వచ్చి స్మశాన వాటిక లోపలి వైపు దృష్టి సారించారు. అక్కడున్న 1850 నాటి ఓ సమాధిపై వెగ్‌మాన్, లూక్ బ్రౌన్ నగ్నంగా శృంగారంలో మునిగి తేలుతున్నారు.
ఇక వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వెగ్‌మాన్‌ను మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. లూక్ బ్రౌన్ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. ఈ స్మశానంలో 1924 వరకు దహన సంస్కారాలు నిర్వహించేవారు. కాగా 2021లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టరీక్ ప్లేస్‌లో చేర్చారు.