సులభంగా యూఏఎన్‌ నంబర్‌తో మొబైల్‌ నంబర్‌ ఇలా లింక్‌ చేయండి..!

  • Publish Date - October 26, 2023 / 04:28 AM IST

ఈపీఎఫ్‌లో పెట్టుబడితో ఉద్యోగులకు భవిష్యత్‌ ఉంతో భరోసాగా నిలుస్తుంది. ఉద్యోగికి కంపెనీ ఈపీఎఫ్‌ అందిస్తుంది. ఎన్ని కంపెనీల్లో ఉద్యోగం చేస్తే.. అన్ని ఈపీఎఫ్‌ ఖాతాలుంటాయి. వాటికి వేర్వేరు పీఎఫ్‌ అకౌంట్‌ నంబర్లుంటాయి. దాంతో ప్రభుత్వం యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ విధానాన్ని తీసుకువచ్చింది. పీఎఫ్‌ ఖాతా ఉన్న ఒక్కో ఉద్యోగికి ఒక యూఏఎన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇది 12 అంకెల్లో ఉంటుంది. ఎన్ని కంపెనీల్లో ఉద్యోగులు చేసినా.. ఎన్ని ఈపీఎఫ్‌ ఖాతాలున్నా అవన్నీ ఒకే యూఏఎన్‌కు అనుసంధానమవుతాయి.


ఈ క్రమంలో ఈ యూఎన్‌ఏ సహాయంతో ఉద్యోగులు ఈపీఎఫ్‌ ఖాతాలను నిర్వహించుకునే వీలుంటుంది. అకౌంట్‌ బ్యాలెన్స్‌, లావాదేవీలకు సంబంధించి వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునే వీలున్నది. అయితే, ఎప్పటికప్పుడు ఈపీఎఫ్‌ ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి యూఏఎన్‌తో అనుసంధించుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు వివరాలను అందుకునే వీలుంటుంది. మీ యూఎన్‌ఏ ఒక వేళ మొబైల్‌ నంబర్‌ అనుసంధానించకపోయినట్లతే.. ఎలా లింక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం రండి..!


మొబైల్‌ నంబర్‌ లింక్‌ ఇలా..


మొదట ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. యూఏఎన్ నంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా రిజిస్టర్‌ చేసుకోనట్లయితే.. మొదట వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ‘మేనేజ్‌’ సెక్షన్‌లోకి వెళ్లి.. ‘కాంటాక్ట్‌ డిటేయిల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ ఛేంజ్‌ మొబైల్‌ నంబర్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి.. రీ కన్ఫర్మేషన్‌ కోసం మరోసారి మొదట ఎంటర్‌ చేసిన నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ‘గెట్‌ అథరైజేషన్‌ పిన్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి. దాని తర్వాత సబ్‌మిట్‌ చేసిన తర్వాత యూఏఎన్ నంబర్‌తో మొబైల్‌ నంబర్‌ లింకింగ్‌ పూర్తవుతుంది.