Loksabha Elections | ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్‌..!

Loksabha Elections | లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. తొలి విడతలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తోపాటే ఇవాళ అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది.

  • Publish Date - April 19, 2024 / 11:51 AM IST

Loksabha Elections : లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. తొలి విడతలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తోపాటే ఇవాళ అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది.

ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఈసారి ఎలాగైనా ఎన్డీయేను గద్దెదించాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తొలి విడతలో దేశవ్యాప్తంగ 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 35.67 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు.

తొలి విడతలో ఓటు వేస్తున్న వారిలో 20-29 ఏళ్ల మధ్య వయసువారు 3.51 కోట్ల మంది ఉన్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది. తొలి విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌), కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ పశ్చిమం), అన్నామలై (కోయింబత్తూర్‌), తమిళిసై సౌందరరాజన్‌ (చెన్నై దక్షిణం) సర్వానంద సోనోవాల్‌ (దిబ్రుగఢ్‌), భూపేంద్రయాదవ్‌ (అల్వర్‌), జితిన్‌ ప్రసాద (ఫిలిబిత్‌) పోటీపడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గౌరవ్‌ గొగొయ్‌ (జోర్హాట్‌), నకుల్‌నాథ్‌ (ఛింద్వారా), కార్తీ చిదంబరం (శివగంగ) బరిలో ఉన్నారు. డీఎంకే నాయకురాలు కనిమొళి కూడా తొలి విడత ఎన్నికల్లోనే తన భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. అరుణాచల్‌లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఇప్పటికే ఏకగ్రీవంగా గెలుచుకుంది.

ఇదిలావుంటే ఉత్తరాఖండ్‌లో ఐదు, రాజస్థాన్‌లో 12, మధ్యప్రదేశ్‌లో ఆరు, త్రిపురలో ఒకటి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మిజోరంలో ఒకటి, సిక్కింలో ఒకటి, తమిళనాడులో 39, అండమాన్‌ నికోబార్‌లో ఒకటి, అస్సాంలో ఐదు, నాగాలాండ్‌లో ఒకటి, బీహార్‌లో నాలుగు, మహారాష్ట్ర ఐదు, మేఘాలయ రెండు, మణిపూర్‌లో రెండు, పశ్చిమబెంగాల్‌లో మూడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది.

Latest News