Actor Dileep : లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట

మలయాళ ప్రముఖ నటుడు దిలీప్‌కు లైంగిక దాడి కేసులో కేరళలోని ఎర్నాకుళం కోర్టులో ఊరట లభించింది. 2017లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

Actor Dileep

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసు మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ కు కోర్టులో ఊరట దక్కింది. మలయాళ ప్రముఖ నటిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నమోదైన కేసులో దిలీప్ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ, ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మొదటి ఆరుగురు నిందితులతో పాటు పల్సర్ సునిని ప్రధాన దోషులుగా తేల్చారు.

2017లో మలయాళ నటి కిడ్నాప్‌ కేసు సంచలనం రేపింది. కారులో ఆమెపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతడు ఎనిమిదవ నిందితుడిగా ఉన్నాడు. అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎనిమిదేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసులో దిలీప్ నిర్ధోషిగా తేలడంతో ఆయన తీవ్ర భావోద్వేగంతో కంట తడి పెట్టుకున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై మరో కేసు కూడా నమోదైంది.

ఇవి కూడా చదవండి :

IAS Amrapali : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
Salman Khan | స‌ల్మాన్ ఖాన్‌కి ఏమైంది.. ఎందుకు అంద‌రి ముందు అలా ఏడ్చాడు?

Latest News