Site icon vidhaatha

మోదీ, హిట్ల‌ర్ ఒక్క‌టే: క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌

మ‌నం బ్ర‌త‌కాలంటే ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బెంగ‌ళూరు: కర్నాటకలో పార్ల మెంట్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు పుంజుకుంటోంది. అధికార , ప్రతి పక్షాల మధ్య‌ తీవ్ర వాగ్యుద్ధం చెలరేగుతోంది. శుక్రవారం రాత్రి పార్ల‌మెంట్‌ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా చామరాజు నగర్ నియోజకవర్గంలో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఆయ‌న‌ మాట్లాడుతూ ప్ర‌ధాని మోదీ, ముసోలిని, హిట్లర్ విధానాలను ఎత్తి పడుతున్నాడన్నారు. మనందరం బతకి వుండాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని తెలిపారు. మోదీని, బీజేపీని ఆయ‌న‌ తీవ్రంగా దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా మోదీకి గిట్టదని మండిప‌డ్డారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి హిట్ల‌ర్ ప‌ద్ధ‌తులు, అత‌ని ఆలోచ‌న‌లు న‌చ్చాయ‌ని, హిట్ల‌ర్ ప‌ద్ధ‌తుల‌నే మోదీ అనుస‌రిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌న్నారు. ఎన్డీఏ కూట‌మి గెల‌వ‌డం అసాధ్య‌మైన ప‌ని అని ఆయ‌న జోష్యం చెప్పారు. కార్ణాట‌క‌లో కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్‌పై పూర్తివిశ్వాసం, న‌మ్మ‌కం ఉంద‌న్నారు. 15 నుంచి 20 స్థానాలు ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని సిద్ధ‌రామ‌య్య వెల్ల‌డించారు. రెండున్న‌ర ఏళ్ల త‌రువాత క‌ర్ణాటక ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ ఉంటాడా లేక సిద్ధ‌రామ‌య్యే కొన‌సాగుతారా అన్న అనుమానాల‌పై ఆయ‌న మాట్లాడారు. రెండున్న‌రేళ్ల త‌రువాత కాంగ్రెస్ అధిస్టానం ఏం చెబుతే అదే చేస్తామ‌ని, సీఎం విష‌యంలో నేను సొంత నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌న్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరు ఏది నిర్ణయించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

Exit mobile version