Site icon vidhaatha

Monsoon rains । రుతుపవనాలపై రైతులకు వాతావరణ విభాగం చేదు వార్త!

Monsoon rains । సకాలంలో వానలు కురియాలి. వానాకాలం (monsoon rains) ఎంత వానలు పడాలో అంతే పడాలి. ఇది సమతుల్యత. ఇది దెబ్బతింటే అయితే కరువులు లేదా.. వరదలు! రైతులతో వాతావరణం జూదం అడుతుందనే నానుడి ఉన్నది. ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం (weather department) చెబుతున్నది. ఈ నెల మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం (low-pressure) ప్రభావంతో సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ వర్షాలు కొనసాగుతూనే ఉంటాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రుతుపవనాల ఉపసంహరణలో కలిగే ఈ జాప్యంతో కురిసే అధిక వర్షపాతం (Above-normal rainfall).. కోతకు వచ్చే వరి, పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, ధాన్యాలు వంటి యాసంగి పంటలను దెబ్బతీసే అవకాశం ఉన్నదని వారు చెప్పారు. ఈ పంటలు సాధారణంగా సెప్టెంబర్‌ మధ్యలో పండిస్తారు.

పంట నష్టాలతో ఆహార ద్రవ్యోల్బణం (food inflation) పెరిగే ప్రమాదం ఉన్నది. అదే సమయంలో వర్షాల కొనసాగింపుతో భూమిపై ఏర్పడే తేమతో గోధుమలు, శనగలు వంటి పంటలకు ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ‘సెప్టెంబర్‌ మూడో వారంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని ఫలితంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ (withdrawal of the monsoon) అలస్యమవుతుంది’ అని భారత వాతావరణ విభాగం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గోధుమలు, చెరుకు, వరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో దేశంగా ఉన్నది. వీటి ఎగుమతులపై వివిధ రకాల ఆంక్షలు ఉన్నాయి. అధిక వర్షాలతో పంట నష్టాలు సంభవించే పక్షంలో ఈ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరింతగా పెంచుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

భారతదేశంలో రుతుపవన సీజన్‌ సాధారణంగా జూన్‌లో మొదలవుతుంది. దేశ వాయవ్య ప్రాంతాల నుంచి సెప్టెంబర్‌ 17 నాటికి ఉపసంహరణ పూర్తి అవుతుంది. మొత్తంగా అక్టోబర్‌ మధ్య నాటికి దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోతాయి. ఈ రుతుపవన సీజన్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం. దేశంలోని నదులు, జలాశయాల 70 శాతం అవసరాలను రుతుపవన సీజన్‌లో పడే వర్షాలు తీరుస్తాయి. నీటిపారుదల సదుపాయాల్లేని దేశంలోని సగానికిపైగా వ్యవసాయ భూముల్లో (farmland) వర్షాలపైనే ఆధారపడి పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ప్రారంభమైన వర్షాకాల సీజన్‌లో సగటు వర్షపాతం కంటే ఏడు శాతం అధిక వర్షపాతం నమోదైంది. కానీ.. కొన్ని రాష్ట్రాల్లో సగటు కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదై.. వరదలకు దారి తీసింది.

సెప్టెంబర్‌ మూడు, నాలుగు వారాలతోపాటు అక్టోబర్‌ మొదటివారంలో కురిసే వర్షాలు చేతికి రావాల్సిన పంటను దెబ్బతీస్తాయని ఫిలిప్‌ క్యాపిటల్‌ ఇండియాలో కమోడిటీస్‌ రిసెర్చ్‌ విభాగం ఉపాధ్యక్షుడు అశ్వినీ బన్సూద్‌ చెప్పారు. అయితే.. వర్షాల తీవ్రతను బట్టి.. ప్రభావం ఉంటుందన్నారు. అక్టోబర్‌ మధ్య వరకూ వర్షాలు కొనసాగితే పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఆయన అంచనావేశారు.

Exit mobile version