Site icon vidhaatha

Girl Molest | బాలిక‌కు లైంగిక వేధింపులు.. 15 సెకన్ల‌లో 23 చెప్పు దెబ్బ‌లు.. వీడియో

Girl Molest | ఓ బాలిక‌ను లైంగికంగా( Girl Molest ) వేధించిన యువ‌కుడిని ఆమె త‌ల్లి చీల్చి చెండాడింది. న‌డిరోడ్డుపై అత‌న్ని ప‌ట్టుకుని చెప్పు దెబ్బ‌ల( thrashing with slippers ) రుచి చూపించింది. కేవ‌లం 15 సెక‌న్ల‌లో 23 సార్లు చెప్పుతో క‌ట్టి త‌న క‌సి తీర్చుకుంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని హ‌మీర్‌పూర్‌( Hamirpur )లో చోటు చేసుకుంది.

ముస్క‌ర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హ‌మీర్‌పుర్‌కు చెదిన ఓ బాలిక‌ను గ‌త కొన్ని రోజుల నుంచి ఓ యువ‌కుడు ఫాలో అవుతున్నాడు. ప్రేమ పేరిట ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. త‌న లైంగిక కోరిక‌లు తీర్చాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నాడు. ఆ కీచ‌కుడి ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన బాలిక త‌న త‌ల్లికి చెప్పింది.

ఇక త‌న త‌ల్లి ఆ యువ‌కుడిని న‌డి రోడ్డుపై ప‌ట్టుకుంది. అంద‌రూ చూస్తుండ‌గానే అత‌డికి దేహ‌శుద్ధి చేసింది. త‌న చెప్పు తీసుకుని అత‌డిని ఉతికి ఆరేసింది. 15 సెక‌న్ల వ్య‌వ‌ధిలో 23 సార్లు చెప్పుతో కొట్టి త‌న క‌సి తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

అయితే ఈ యువ‌కుడు ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలి త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌న్నారు.

Exit mobile version