Pallavi Dempo | వ్యాపారరంగం నుంచి రాజకీయాల్లోకి..! గోవా చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ బరిలో మహిళ

Pallavi Dempo | చరిత్రలో తొలిసారిగా దక్షిణ గోవా పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. డెంపో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, డెంపో ఛారిటీస్‌ ట్రస్ట్‌ ట్రస్టీ అయిన పల్లవి డెంపోకు బీజేపీ టికెట్‌ను కేటాయించింది. ఈ పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్నది.

  • Publish Date - April 21, 2024 / 11:20 AM IST

Pallavi Dempo | చరిత్రలో తొలిసారిగా దక్షిణ గోవా పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. డెంపో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, డెంపో ఛారిటీస్‌ ట్రస్ట్‌ ట్రస్టీ అయిన పల్లవి డెంపోకు బీజేపీ టికెట్‌ను కేటాయించింది. ఈ పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్నది. ఇక్కడ వరుసగా మూడోసారి గెలుపొందాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఈ సారి అక్కడ విజయం సాధించాలన్న పట్టుదలతో బీజేపీ పల్లవి డెంపోను బరిలో నిలిపింది. మిట్‌ పుణే నుంచి కెమెస్ట్రీ, ఎంబీఏలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన పల్లవి ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమెకు టికెట్‌ను కేటాయించింది. బీజేపీ సిద్ధాంతాలపై నాకు నమ్మకం ఉందని.. అందకే పార్టీలో చేరినట్లు తెలిపారు. దక్షిణ గోవా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే బీజేపీ గెలుపొందింది.  1999, 2014లో మాత్రమే గెలుపొందగా.. కాంగ్రెస్‌ పదిసార్లు ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ టికెట్‌ కేటాయించడంతో పల్లవి నామినేషన్‌ దాఖలు చేశారు. నామపత్రాల్లో తనతో పాటు భర్తకు రూ.1400కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. లగ్జరీ కార్లు ఉన్నాయి. దుబాయి, లండన్‌లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

పల్లవి విద్య, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్‌కు (GCCI) అధిప‌తిగా కొన‌సాగుతున్నారు. పల్లవి భర్త శ్రీనివాస్ డెంపో.. డెంపో గ్రూప్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2019-2024 మధ్య సుమారు రూ. 1.35 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేశారు. రెండు పర్యాయాలు బీజేపీ రూ.కోటి విలువైన బాండ్లను రీడీమ్ చేసింది. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీనివాస్ రూ.1.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా.. అందులో బీజేపీ రూ.50 లక్షల విలువైన బాండ్లను రీడీమ్ చేసింది.

Latest News