Begumpul RRTS | తొలిసారిగా నమో భారత్‌.. మెట్రో రైలు ఒకే ట్రాక్‌పైకి..! బేగంపూల్‌ స్టేషన్‌ ప్రత్యేకతలు తెలుసా..?

Begumpul RRTS | భూమి లోపల 22 మీటర్ల లోతులో భూగర్భ రైల్వేస్టేషన్‌ సిద్ధమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్మాణం దశలో ఉన్నది ఈ బేగంపూల్‌ రైల్వే్స్టేషన్‌. ఈ స్టేషన్‌ ప్రత్యేకత విషయానికి వస్తే మొట్టమొదటిసారి నమో భారత్‌ రైలుతో పాటు మెట్రో రైలును సైతం ఒకేసారి పట్టాలపై నుంచి పరుగులు తీయనున్నాయి.

  • Publish Date - June 17, 2024 / 07:48 AM IST

Begumpul RRTS | భూమి లోపల 22 మీటర్ల లోతులో భూగర్భ రైల్వేస్టేషన్‌ సిద్ధమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్మాణం దశలో ఉన్నది ఈ బేగంపూల్‌ రైల్వే్స్టేషన్‌. ఈ స్టేషన్‌ ప్రత్యేకత విషయానికి వస్తే మొట్టమొదటిసారి నమో భారత్‌ రైలుతో పాటు మెట్రో రైలును సైతం ఒకేసారి పట్టాలపై నుంచి పరుగులు తీయనున్నాయి. ఈ రైల్వేస్టేసన్‌ ట్రాక్‌లపై రెండువైపులా ట్రైన్లు వెళ్లే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. స్టేషన్‌ మొత్తం ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్‌లను ఇప్పటికే బిగించారు.

బేగంపూల్‌తో పాటు మీరట్‌ సెంట్రల్‌, భైంసాలీలో సైతం భూగర్భ రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉండగా.. బేగంపూల్‌ స్టేషన్‌లో ఉన్న సౌకర్యాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ రైల్వేస్టేషన్‌ పొడవు దాదాపు 246 మీటర్లు ఉంటుంది. ఇక వెడెల్పు 24.5 మీటర్లు. బేగంపూల్ భూగర్భ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 20 అత్యాధునికమైన ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌లో మెట్లతో పాటు ఐదు లిఫ్టులను సైతం నిర్మిస్తున్నారు. స్ట్రెచర్స్‌ను తీసుకువెళ్లేందుకు వీలుగా లిఫ్ట్‌ల డిజైన్‌ను రూపొందించారు. స్టేషన్‌లో నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్స్‌ను ఏర్పాటు చేయగా.. ట్రాఫిక్‌ దృష్టిలో పెట్టుకొని తొలి ఎగ్జిట్‌ గేట్‌ను నిర్మించారు.

సోటిగంజ్ వైపు నుంచి వారి కోసం రెండో ఎగ్జిట్‌ గేట్‌.. నేషనల్‌ ఇంటర్‌ కాలేజీ వైపునకు వెళ్లేవారి కోసం మూడో గేట్‌, మీరట్‌ కంటోన్మెంట్‌ వైపు నాలుగో గేట్‌ను ఏర్పాటు చేశారు. వివిధ రకాల సరుకులను కొనుగోలు చేసేందుకు మీరట్‌ నగరంలోని బేగంపూల్ ప్రాంతానికి ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. నమో భారత్‌, మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగనున్నది. నమో భారత్, మీరట్ మెట్రో రైళ్లు మీరట్ సౌత్, శతాబ్దినగర్, బేగంపుల్, మోదీపురం స్టేషన్స్‌లో ఆగనున్నాయి. మీరట్‌ మెట్రో కోసం ఆ నగరంలో 23 కిలోమీటర్ల వ్యవధిలో 13 స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో మీరట్‌ సెంట్రల్‌, భైంసాలీ, బేగంపూర్‌ రైల్వేస్టేషన్లు భూగర్భంలో ఉండగా.. వచ్చే ఏడాది వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది.

Latest News