Site icon vidhaatha

Meerut Murder: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భర్తను15ముక్కలు చేసింది!

Meerut murder:  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసి ముక్కలుగా నరికిన దారణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగింది. మీరట్ లోని ఇందిరా నగర్ కు చెందిన మర్చంట్ నేవి ఉద్యోగి సౌరబ్ రాజ్ పుత్(29) ను 2016లో ముస్కాన్  రస్తోగి(27) ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఉద్యోగ రిత్యా సౌరబ్ రాజ్ పుత్ సముద్రంపైన ఎక్కువ కాలం ఉండేవాడు. ఇంతలో భర్త స్నేహితుడు సాహిల్ శుక్లాతో ముస్కాన్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలానికి విషయం తెలుసుకున్న భర్త సౌరభ్ రాజ్ పుత్ తన భార్య ముస్కాన్ ను మందలించాడు.

ఇటీవల తన కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం సర్ ప్రైజ్ గా ముందుగా చెప్పకుండా యూస్ నేవీ డ్యూటీ నుంచి ఫిబ్రవరి 24న ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా సాహిల్ తో రిలేషన్ పై భార్య ముస్కాన్ తో మళ్లీ గొడవ జరిగింది. మార్చి 4వ తేదీన ముస్కాన్ భర్త సౌరభ్ ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అతను నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు సాహిల్ తో కలిసి భర్తను కత్తితో పొడిచి చంపింది. మృతదేహాన్ని 15ముక్కులుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ తో మూసేశారు. తర్వాత ఆ డ్రమ్మును బయట పడేయాలనుకున్నారు. అయితే సౌరభ్ రాజ్ పుత్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం..వారు విచారణకు రావడంతో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం విఫలమైంది.

భర్త సౌరబ్ రాజ్ పుత్ ను హత్య చేశాక  విషయం బయటపడకుండా ఉండేందుకు ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు విహార యాత్రకు వెళ్లింది. తన భర్త ఫోన్ నుంచి తన ఫోన్ కు సందేశాలు పంపి పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ముస్కాన్, సాహిల్ లపై అనుమానంతో వారిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో వారిద్ధరి అక్రమ సంబంధం బయటపడగా..సౌరబ్ రాజ్ పుత్ హత్య మిస్టరీ వీడిపోయింది.

మార్చి 4న రాజ్ పుత్ ను కత్తితో పొడిచి చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసి సిమెంట్ తో సీల్ చేసినట్లుగా నిందితులు విచారణలో అంగీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి నిందితులను రిమాండ్ కు తరలించారు. రెండు గంటల పాటు కష్టపడిన పోలీసులు డ్రమ్ ని తెరవలేకపోయారు. చివరికి డ్రమ్‌ను కత్తిరించగా.. శరీర భాగాలు సిమెంట్ తో గడ్డకట్టిపోయాయి. గంజాయి అలవాటు ఉన్న సాహిల్ క్రమంగా ముస్కాన్ కు కూడా గంజాయి అలవాటు చేసి తనను వదిలి వెళ్లకుండా చేసుకున్నాడని విచారణలో తేలింది. మంచి భర్తను చంపేసిన తన కూతురు ముస్కాన్ ను ఉరి తీయాలని ఆమె తల్లి పోలీసులను కోరడం విశేషం.

Exit mobile version