Site icon vidhaatha

Woman elopes with Brother-in-law | నా భ‌ర్త లైంగికంగా అస‌మ‌ర్థుడు.. మ‌రిదిని పెళ్లాడుతానంటున్న వ‌దిన‌

Woman elopes with Brother-in-law | ల‌క్నో : ఇదో వింత.. నా భ‌ర్త( Husband ) లైంగికంగా అస‌మ‌ర్థుడు అని భార్య( Wife ) వాదిస్తుంటే.. నా భార్య‌కు నా గ‌డ్డం( Beard ) న‌చ్చ‌క నన్ను విడిచిపెట్టింద‌ని భ‌ర్త వాదిస్తున్నాడు. వాదోప‌వాదాల మ‌ధ్య భ‌ర్త వ‌ద్దే వ‌ద్దు.. మ‌రిది( Brother-in-law ) ముద్దు అంటోండి ఆవిడ‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని మీర‌ట్‌( Meerut )కు చెందిన ఓ యువ‌తికి ఏడు నెల‌ల క్రితం మ‌హ‌మ్మ‌ద్ షాగీర్ (Mohammed Sagir  )అనే వ్య‌క్తితో వివాహ‌మైంది. అయితే షాగీర్ అందంగా గ‌డ్డం పెంచుకున్నాడు. కానీ భార్య ఆర్షి(Arshi  )కి అత‌ని గ‌డ్డం న‌చ్చ‌లేదు. నీట్‌గా షేవ్( Shave ) చేసుకోవాల‌ని ప‌లుమార్లు భ‌ర్త‌కు చెప్పింది. కానీ షాగీర్ పెడ‌చెవిన పెట్టాడు.

నీట్‌గా మ‌రిది..

ఇక ఒకే ఇంట్లో ఉంటున్న షాగీర్ సోద‌రుడు ష‌బ్బీర్‌(Sabir )పై ఆర్షి మ‌న‌సు పారేసుకుంది. ఎందుకంటే ష‌బ్బీర్ నీట్‌గా సేవ్ చేసుకుని హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. ఇక అత‌నితో వివాహేత‌ర సంబంధం( Affair ) పెట్టుకుంది ఆర్షి. భ‌ర్త గ‌డ్డం తీయ‌క‌పోవ‌డంతో.. ష‌బ్బీర్ నీట్‌గా ఉండ‌డంతో.. అత‌నితో క‌లిసి ఆర్షి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

మూడు నెల‌లుగా భార్య కోసం ఎదురుచూపులు

గ‌త మూడు నెల‌ల నుంచి భార్య ఆర్షి కోసం షాగీర్ ఎదురుచూస్తున్నాడు. కానీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. చేసేదేమీ లేక చివ‌ర‌కు షాగీర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. త‌న భార్య అదృశ్య‌మైన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆర్షి త‌న గ‌డ్డాన్ని వ్య‌తిరేకిస్తుంద‌ని.. బ‌ల‌వంతంగా త‌న‌ను పెళ్లి చేసుకుంద‌ని చెప్పాడు. చివ‌ర‌కు త‌న చిన్న త‌మ్ముడితో వెళ్లిపోయింద‌ని తెలిపాడు. వారిద్ద‌రూ మాట్లాడుకున్న ఫోన్ సంభాష‌ణ‌లు త‌న‌తో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. త‌న‌ను హ‌త్య చేసేందుకు కుట్ర చేశాడ‌ని బోరుమ‌న్నాడు.

ఎట్ట‌కేల‌కు తల్లిదండ్రుల చెంత‌కు..

మూడు నెల‌ల త‌ర్వాత‌.. గ‌త బుధ‌వారం ఆర్షి త‌న ప్రియుడు ష‌బ్బీర్‌తో క‌లిసి త‌న త‌ల్లిదండ్రుల చెంత‌కు చేరింది. త‌న‌కు తన భ‌ర్త గ‌డ్డంతో ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, అత‌ను లైంగికంగా అస‌మ‌ర్థుడు అని తేల్చిచెప్పింది. కాబ‌ట్టి తాను ష‌బ్బీర్‌ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. క‌ట్నం కింద ఇచ్చిన రూ. 5 ల‌క్ష‌లు తిరిగి ఇవ్వాల‌ని ఆర్షి డిమాండ్ చేసింది. క‌ట్నంలో స‌గం 2.5 ల‌క్ష‌లు ఇచ్చినా తాను విడాకులు ఇస్తాన‌ని ఆర్షి చెప్పింది. క‌ట్నం డ‌బ్బులు ఇచ్చినా ఇవ్వ‌కున్నా ష‌బ్బీర్‌తో క‌లిసి జీవిస్తాన‌ని ఆర్షి తేల్చిచెప్పింది.

Exit mobile version