Ramoji Rao | రామోజీరావు మరణం చాలా బాధాకరం.. సంతాపం తెలిపిన నరేంద్రమోదీ

Ramoji Rao |

  • Publish Date - June 8, 2024 / 09:35 AM IST

Ramoji Rao : ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. రామోజీరావు భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని కొనియాడారు. ఆయన గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయని గుర్తుచేశారు. ఆయనతో సంభాషించేందుకు, ఆయన నుంచి జ్ఞానం పొందేందుకు తనకు చాలా అవకాశాలు వచ్చాయని, అది తన అదృష్టమని పేర్కొన్నారు. రామోజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘శ్రీ రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన మీడియా రంగంలో, వినోద ప్రపంచంలో అనేక ప్రయత్నాల ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీరావు గారు భారతదేశ అభివృద్ధిపట్ల చాలా మక్కువ చూపేవారు’ అని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

‘నాకు రామోజీరావుతో మట్లాడటానికి, అతని నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనేక అవకాశాలు వచ్చాయి. అది నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ సంతాపం తెలియజేశారు. కాగా, గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ తెల్లవారుజామున 4.50 గంటలకు క‌న్నుమూశారు.

Latest News