Modi Mocks Rahul Gandhi Fishing | రాహుల్ చేపలవేటపై మోదీ సెటైర్స్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్‌లో మత్స్యకారులతో కలిసి చేపల వేట కోసం చెరువులోకి దిగడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

PM Modi Mocks Rahul Gandhi

విధాత: బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల అక్కడి మత్స్యకారులతో కలిసి చేపల వేట కోసం చెరువులోకి దిగి ఈదుతూ మత్స్యకారులతో ముచ్చటించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. బీహార్ చేపలను చూసేందుకు పెద్దపెద్దవాళ్లు వస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అయితే కతిహార్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ. 10వేలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టొచ్చని బీజేపీ భావిస్తోందని ప్రియాంకా గాంధీ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ నత ఇద్దరు కార్పొరేట్ దోస్తులకే అప్పగితస్తున్నారని విమర్శించారు. నాటు తుపాకీ వంటి పదాలను ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక దుయ్యబట్టారు.