న్యూఢిల్లీ : బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటనకు రంగం సిద్దమైంది. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో సీఈసీ మీడియా సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో బీహార్ ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే బిహార్ లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణ సన్నాహాలపై సీఈసీ రెండు రోజుల పాటు పర్యటించి..పలు సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిహార్ అసెంబ్లీ ఎన్నీకలను నవంబర్ 22 లోగా పూర్తి చేస్తామని..ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బిహార్ లో ఓటర్ల జాబితా ప్రక్షాళన సజావుగా జరిగిందని, గడువులోగా పూర్తయ్యిందన్నారు. ఎస్ఐఆర్ విషయంతో బీహార్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలిపారు. 243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీకి గడువు 2025 నవంబర్ 22తో ముగియనుందని.. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉన్నందునా..అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
