Mohammed Anwar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలకముందే.. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. నేనషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన మహ్మద్ అన్వర్ గుండెపోటుతో చనిపోయారు. ఎర్రగడ్డ పరిధిలోని బీ శంకర్ లాల్ నగర్‌కు చెందిన అన్వర్.. ఫలితం తేలకముందే గుండెపోటుకు గురికావడం ఎర్రగడ్డలో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. నిరుద్యోగ అభ్యర్థులు 13 మంది పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.
