Site icon vidhaatha

PM Modi | వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ.. ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి

PM Modi : ఉత్తప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రధాని మోదీపై అజయ్‌ రాయ్‌ 6,223 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎర్లీ టెండ్స్‌లో ఎన్డీఏ కూటమి 300కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. పదేళ్లు ఎన్డీఏ సర్కారును నడిపిన ప్రధాని మోదీ వెనుకంజలో ఉండటం గమనార్హం.

ప్రధాని మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా వారణాసి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పడు కూడా తన విజయం నల్లేరు మీద బండి నడకే అని ప్రధాని ధీమాతో ఉన్నారు. కానీ ప్రాథమిక ఫలితాలు అందుకు విరుద్ధంగా వస్తుండటంతో మోదీ ఓటమి చవిచూస్తారా..? అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 10.50 లక్షల కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఓట్లను లెక్కిస్తున్నారు.

Exit mobile version