న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ(President Droupadi Murmu) ముర్ము జలాంతర్గామి(submarine journey)లో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లో ఆమె ప్రయాణం చేశారు. రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి ఉన్నారు.
జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి ముర్ము కావడం విశేషం. కల్వరి క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు. ఐఎన్ఎస్ వాగ్‌షీర్ అనేది మన దేశంలోనే తయారైన అత్యాధునిక ‘కల్వరి’ తరగతికి చెందిన జలాంతర్గామి.
ఈ పర్యటన ద్వారా నౌకాదళ సిబ్బందికి ముర్ము అండగా నిలిచారు. క్లిష్టమైన వాతావరణంలో పనిచేసే సైనికులకు ఆమె రాక గొప్ప స్ఫూర్తినిచ్చింది. సబ్ మెరైన్ లోపల ఉండే సాంకేతికతను, సిబ్బంది సామర్థ్యాన్ని రాష్ట్రపతి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సముద్రం అడుగున ఉండే క్లిష్ట పరిస్థితుల్లో మన నావికా దళం ఎలా విధులు నిర్వర్తిస్తుందో తెలుసుకోవడానికి ఈ పర్యటన దోహదపడింది.
