Traffic Restrictions | ఇవాళ‌, రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఆ మార్గాల్లో వెళ్ల‌కండి..!

Traffic Restrictions | రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) అల‌ర్ట్ అయ్యారు. ఈ నెల 21, 22వ తేదీల్లో రాష్ట్ర‌ప‌తి హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic restrictions ) విధించారు.

Traffic Restrictions | హైద‌రాబాద్ : రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) అల‌ర్ట్ అయ్యారు. ఈ నెల 21, 22వ తేదీల్లో రాష్ట్ర‌ప‌తి హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic restrictions ) విధించారు.

ముఖ్యంగా బేగంపేట్, సికింద్రాబాద్, తిరుమ‌ల‌గిరి జంక్ష‌న్ల వ‌ద్ద సంద‌ర్భాన్ని బ‌ట్టి వాహ‌నాల‌ను మ‌ళ్లించ‌డం లేదా నిలిపివేయ‌డం జ‌రుగుతుంద‌ని పోలీసులు తెలిపారు. శుక్ర‌వారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 6.45 గంటల వరకు సీటీఓ, రసూల్‌పురా, పిఎన్‌టి జంక్షన్‌, హెచ్‌పిఎస్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, పంజాగుట్ట జంక్షన్‌, మొనప్ప జంక్షన్‌, యశోద హాస్పిటల్‌, సోమాజిగూడ కత్రియ హోటల్‌, రాజ్‌భవన్‌, మెట్రో రెసిడెన్సీ, వివి స్టాచ్యు, రాజ్‌భవన్‌ మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు.

ఈనెల 22న ఉదయం 8.30గంటల నుంచి రాత్రి 9.30వరకు రాజ్‌భవన్‌, వివి స్టాచ్యు, మెట్రొ రెసిడెన్సీ, రాజ్‌భవన్‌, కత్రియ హోటల్‌, యశోద హాస్పిటల్‌, మొనప్ప జంక్షన్‌, పంజాగుట్ట జంక్షన్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, హెచ్‌పిఎస్‌, పిఎన్‌టి జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ రహదారులపై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్‌ సీపీ వెల్లడించారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌లో ఇబ్బందులు తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబ‌ర్ 9010203626 కాల్ చేయాల‌ని సూచించారు.

Latest News