Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Basara IIIT

విధాత : అదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసంత బాలికల హాస్టల్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సిబ్బంది గుర్తించారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.

విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని కుటుంబసభ్యులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Nani | ‘జడల్ జమానా’ సోషల్ మీడియాలో దుమారం… నాని సాంగ్ త‌ర్వాత మ‌న హీరోలంద‌రికి జ‌డ‌ల్ త‌గిలించారుగా..!
Donald Trump| అపరేషన్ సిందూర్ ఆపకపోతే..పాక్ ప్రధాని చచ్చేవారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Latest News