Rahul Gandhi | పాపం నీట్ విద్యార్థులు: రాహుల్‌గాంధీ ట్వీట్

నీట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మోదీ ప్రధానిగా ప్రమాణమే చేయలేదు

  • Publish Date - June 9, 2024 / 02:36 PM IST

విధాత: నీట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మోదీ ప్రధానిగా ప్రమాణమే చేయలేదు.. అప్పుడే పాపం నీట్ విద్యార్థులు అంటూ ఆయన ట్వీట్ చేశారు. మోదీ ప్రధానిగా ప్రమాణమే చేయలేదని.. నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని, 24 లక్షల మందికి పైగా విద్యార్థులను వారి కుటుంబాలను ఇది నాశనం చేసిందని రాహుల్ గాంధీ ట్విటర్ లో ఆరోపించారు. నీట్ ఫలితాల్లో 67మంది విద్యార్థులకు 720కి 720మార్కులతో ఫస్ట్ ర్యాంక్‌ రావడం..అందులో ఆరుగురు విద్యార్థులు ఒకే సెంటర్‌కు చెందినవారు కావడం.. గ్రేస్ మార్కులు కలిపిన తీరు వివాదస్పదమైంది.

అయితే దీనిపై కేంద్ర విద్యాశాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారధ్యంలో నలుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటుచేసింది, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్ ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ జరుగలేదని, ఆరు సెంటర్లలో విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో వారికి నిబంధనల మేరకు గ్రేస్ మార్కులు కలిపారని వివరణ ఇచ్చారు. అయితే నీట్‌లో అవకతవకలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ నీట్ ఫలితాలపై పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

Latest News