బాలివుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ నోటీస్‌లు

  • Publish Date - October 4, 2023 / 01:41 PM IST
  • 6న విచారణకు రావాలన్న ఈడీ

విధాత : బాలివుడ్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్‌కు సంబంధించి ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీస్‌లు అందించింది. దుబాయ్ కేంద్రంగా ఉండే మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌కు రణబీర్ కపూర్ ప్రచార కర్తగా వ్యవహారించారు.


తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే 10మందిని అరెస్టు సైతం చేశారు. రణబీర్ కపూర్ ఈడీ నోటీస్‌లు జారీ చేయడం బాలివుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.