Site icon vidhaatha

Moustache | 14 ఇంచుల మీసాల అంద‌గాడు.. ఆ రిటైర్డ్ జ‌వాన్..

Moustache | పురుషులు ఎవ‌రైనా స‌రే దేహ‌దారుఢ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తారు. కండ‌లు తిరిగేలా వ‌ర్క‌వుట్స్ చేస్తుంటారు. త‌మ బాడీ ఫిట్‌( Body Fit )గా ఉండేలా చూసుకుంటారు. కొంద‌రైతే కేశాలంక‌ర‌ణ‌పై దృష్టి సారిస్తుంటారు. హెయిర్ స్టైల్‌తో పాటు త‌మ గ‌డ్డం, మీసాల‌( Moustache )పై శ్ర‌ద్ధ వ‌హిస్తుంటారు. ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు మీసాలు(Moustache ), గ‌డ్డ‌ల‌ను పెంచేసుకుంటారు. అయితే ఓ రిటైర్డ్ జ‌వాన్( Retired Jawan ) కూడా త‌న మీసాల మీద దృష్టి సారించాడు. 14 ఇంచుల వ‌ర‌కు మీసాల‌ను పెంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ మీసాల అంద‌గాడి గురించి తెలుసుకోవాలంటే బీహార్( Bihar ) వెళ్లాల్సిందే.

బీహార్( Bihar ) ఖ‌గారియా జిల్లాలోని ప‌ర్బ‌ట్టా బ్లాక్‌కు చెందిన న‌రేశ్ హాజ‌రి( Naresh Hazari ).. రిటైర్డ్ సీఐఎస్ఎఫ్ జ‌వాన్( CISF Jawan ). స‌ర్వీసులో ఉన్న‌ప్పుడు కూడా మీసాలు పెంచేవాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన త‌ర్వాత కూడా త‌మ మీసాల‌పై దృష్టి సారించి భారీగా పెంచుతున్నాడు. ఇప్పుడు అత‌ని మీసాల పొడ‌వు 14 ఇంచులు. న‌రేశ్ స‌ర్వీసులో ఉన్న‌ప్పుడు హాజ‌రీకి మీసాల మెయింటెనెన్స్ కోసం ప్ర‌భుత్వం అద‌నంగా డ‌బ్బులు ఇచ్చేది. ఆ స‌మ‌యంలో 42 ఇంచుల వ‌ర‌కు మీసాలు పెంచిన‌ట్లు న‌రేశ్ గుర్తు చేశారు. త‌న మీసాల‌కు అనేక సంద‌ర్భాల్లో గౌర‌వం ల‌భించింద‌ని తెలిపారు.

త‌న జీవిత కాలంలో ఒక్క‌సారి మాత్ర‌మే మీసాల‌ను పూర్తిగా తీసేశాన‌ని న‌రేశ్ తెలిపారు. 1985లో జ‌రిగిన ఓ అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా మీసాలు తీసేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ఆ త‌ర్వాత మీసాల‌ను తీసేయ‌లేదు. ప్ర‌స్తుతం 14 ఇంచుల పొడవు మీసాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

సీఐఎస్ఎఫ్‌లో 1978లో జాయిన్ అయ్యాన‌ని న‌రేశ్ తెలిపారు. 2015లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాను. సీఐఎస్ఎఫ్‌లో చేరే కంటే ముందు.. ముక్తి సేవ‌లో పాల్గొన్న‌ట్లు తెలిపారు. మీసాలు మ‌నిషి గౌర‌వాన్ని పెంపొందిస్తాయ‌ని తాను బ‌లంగా న‌మ్ముతాన‌ని న‌రేశ్ చెప్పారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు మీసాలు తీసేయ‌లేదు. నాన్న చ‌నిపోయిన‌ప్పుడు మాత్ర‌మే మీసాలు తీసేశాన‌ని గుర్తు చేశారు న‌రేశ్‌.

Exit mobile version