విధాత: ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్‌గానే కాదు ఏ రాష్ట్ర లేక కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్‌గా కూడా పనికిరాడని హిందూ సంపాదకుడు ఎన్.రామ్ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం మహాత్మాగాంధీ వల్ల రాలేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందని రవి వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. రవి వ్యాఖ్య ఒక జోక్ అని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని భారత స్వాతంత్య్రోద్యమానికి 1942 తర్వాత మనుగడ లేదని ఆర్ఎన్ రవి సుభాష్ చంద్రబోస్ 127వ జయంత్యుత్సవం సందర్భంగా మాట్లాడారు. సుభాష్ చంద్రబోస్ లేకపోతే 1947లో స్వాతంత్య్రం వచ్చేది కాదని ఆయన అన్నారు. గవర్నరయినా ముఖ్యమంత్రయినా భారత దేశ చరిత్రను లోతుగా చదువుకోవాలి. చదువనప్పుడు వేదికలపై మాట్లాడకూడదు. అతను మాట్లాడింది ఒక పెద్ద జోక్ అని ఎన్ రామ్ అన్నారు.