Site icon vidhaatha

Delhi Liquor Case | లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు విచారణ వాయిదా.. వర్చువల్‌గా హాజరైన కవిత

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. ఈ విచారణకు తీహర్ జైలు నుంచి బీఆరెస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

మరోవైపు సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈనెల 27న విచారణ జరుగనుంది. ఈ కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 23వరకు న్యాయస్థానం సమయమిచ్చింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, తీహార్ జైలులో ఏప్రిల్ 24న సీబీఐ అరెస్టు చేసింది. కవిత బెయిల్ ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారింది.

Exit mobile version