Site icon vidhaatha

ఓటరు శాతాల వెల్లడికి ఈసీని ఆదేశించలేం.. ఏడీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ శాతాలను వెబ్‌సైట్‌లో వెల్లడించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొన్నది. ఈ అంశాన్ని కోర్టు సెలవుల అనంతరం మరొకరోజు విచారిస్తామంటూ వాయిదా వేసింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ ధర్మాసనం.. ఈ దశలో ఎలాంటి ఉపశమనం కలిగించలేమని తెలిపింది. ఇప్పటికే ఐదు దశలు ముగిసి, ఇంకా రెండు దఫాల పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈసీకి ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేమని పేర్కొన్నది.

Exit mobile version